భూసేకరణకు రూ.300 కోట్లు | - | Sakshi
Sakshi News home page

భూసేకరణకు రూ.300 కోట్లు

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

ధర్మారం: మేడారం రిజర్వాయర్‌ ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించేలా చామనపల్లి గ్రా మం మొత్తానికి భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌ కుమార్‌ తెలిపారు. నిర్వాసితులు కోరుకున్న స్థ లంలోనే పునరావాసం కల్పిస్తామన్నారు. చామనపల్లి పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి నిర్వహించిన గ్రామసభలో మాట్లాడా రు. మేడారం రిజర్వాయర్‌ ముంపు సమస్యతో చా మనపల్లి గ్రామస్తులు పదేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి గ్రామ పరిధిలోని మొత్తం భూమి సేకరించాలని ఆదేశించారన్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై రూ.300 కోట్లకుపైగా భా రం పడుతున్నా ప్రతీకుటుంబానికి న్యాయం చేయడమే లక్ష్యమన్నారు. నాలుగు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ, భూసేకరణ సర్వే కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిని వీడియోలో రికార్డు చేస్తామని తెలిపారు. సర్పంచ్‌ వే ల్పుల రేవతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ట్రైనీ డి ప్యూటీ కలెక్టర్‌ వనజా నాయక్‌, ఆర్‌డీవో గంగయ్య, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, లావుడ్య రూప్లానాయక్‌, అశోద అజయ్‌, చింతల ప్రదీప్‌రెడ్డి, ఓరం చిరంజీవి, రాజేందర్‌రెడ్డి, గౌడ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

కోరుకున్న చోటే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement