పెద్దపల్లిరూరల్: 18ఏళ్ల వయసు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించడం, మృతులు, విదేశీయుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడమే ఎస్ ఐఆర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మా జీప్రధాని పీవీ నర్సింహారావు 2004లో చనిపోతే ఇప్పటికీ ఓటరు జాబితా నుంచి పేరు తొలగించలేదని గుర్తుచేశారు. విదేశీయులు రకరకాల మార్గాలతో దేశంలోకి చొరబడి ఇక్కడే స్థిరపడి పౌరసత్వం తీసుకుని సంక్షేమ పథకాల ఫలాలను పొందుతుంటే.. దేశప్రజలకు తీరని నష్టం కలుగుతోందన్నారు. ప్రధానిని నిర్ణయించేంది మనదేశ పౌరులేనని, విదే శీయులకు ఆ అవకాశం ఇస్తామా? అని సంజయ్ ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు రా మగిరి అఖిల్, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, పల్లె సదానందం, సోడాబాబు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్


