మంథని/రామగిరి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ద్వారా రాష్ట్రంలో సాగునీటి అవసరాలకు పెద్దపీట వేసే అవకాశం ఉండగా, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం నిర్మించిన మూడు బ్యారేజీల ద్వా రా మంథని నియోజకవర్గానికి చుక్కనీరు అందలేదని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నియోజకవర్గంలోని మంథని, రామగిరి మండలాల్లో మంత్రి మంగళవారం పర్యటించారు. మంథని ప్రభుత్వ హైస్కూల్‌లో కంప్యూటర్ ల్యా బ్, గోదావరిఖని రోడ్డులో హెలిప్యాడ్ పరిశీలించా రు. పుట్టపాక, ఖానాపూర్‌లో వాటర్ ప్లాంట్, గ్రా మపంచాయతీ భవనం ప్రారంభించారు. మంథని లో విలేకరులతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ప్రాజె క్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం సరికాదన్నారు.
ఒకటిన మంథనికి సచ్చిదానందస్వామి
సచ్చిదానందస్వామి నవంబరు ఒకటో తేదీన మంథనికి వస్తారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దత్తాత్రేయస్వామి ఆలయంలో పూజలు చేశాక శివకిరణ్ గార్డెన్‌లో ప్రవచనాలు, ఆశీర్వాదం అందిస్తారన్నారు. ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పూజిస్తామని అన్నారు. ఆయా కా ర్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, విద్యుత్ ని యంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ పల్గొన్నారు.
రీడిజైన్‌తో మంథనికి నష్టం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


