ధర్మారం: దొంగ తుర్తి జెడ్పీ హై స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని ముత్యాల నందిని రాష్ట్రస్థాయి అండ ర్ –14 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ శ్రీని వాస్ తెలిపారు. ఈనెల 29 నుంచి 31 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో నందిని ఉమ్మడి కరీంనగర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, సర్పంచు కోడారి మంగ, ఉపాధ్యాయులు అభినందించారు.
రికార్డులు నిర్వహించాలి
జూలపల్లి: గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనులను, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్‌పీవో దేవకీదేవి సూచించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సిగ్రిగేషన్ షెడ్‌లు, శ్మశానవాటిక నిర్వహణ, వర్మికంపోస్టు తయారీ, ఆస్తిపన్ను వసూలు పకడ్డందీగా చేపట్టాలని చెప్పారు. ఎంపీవో శేష య్యసూరి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా త్రోబాల్ అసోసియేషన్ మహిళలదే..
పెద్దపల్లి: జిల్లా త్రో బాల్ అసో సియేషన్ కీలక బా ధ్యతలను మహిళలకు అప్పగించారు. జిల్లా అధ్యక్షురాలి గా మాటేటి కృష్ణప్రియ, ప్రధాన కార్యదర్శిగా బొల్లి మౌనిక నియమితులయ్యారు. రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వారిని పలువురు అభినందించారు.
పరిశుభ్రతపై అవగాహన
పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం కాయకల్ప కార్యక్రమంపై ప్రచా రం చేశారు. పారిశుధ్యం నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణ లక్ష్యమని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. పేషెంట్లకు సురక్షితమైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, వివిధ విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
సహస్రకు అభినందన
రామగుండం: అంతర్గాం మండలం పొట్యాల జెడ్పీ హైస్కూల్ ఏడోతరగతి విద్యార్థిని మారం సహస్ర జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో సంగీత మంగళవారం తెలిపారు. సర్పంచ్ జాడి లోకేశ్, ఫిజికల్ డైరెక్టర్ తిరుపతి తదితరులు ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందించారు. ఈ నెల 29–31వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని హాజరవుతుందని ఎంఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ సురేశ్, ఉపాధ్యాయులు గద్దె శ్రీనివాస్, రాంచందర్, తిరుపతి, శ్రీధర్, లక్ష్మయ్య, జ్యోతివాణి, సునీత, శంకర్, బాల య్య, సీఆర్పీ తీగుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు ‘వైట్‌కోట్’ వేడుక
కోల్‌సిటీ: రామగుండంలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)లో 2026–27 విద్యా సంవత్సర ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం బుధవారం వైట్‌కోట్ వేడుక నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ దయాల్‌సింగ్ మంగళవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కళాశాల లెక్చర్ గ్యాలరీ–1లో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్యలోకి అడుగుపెడుతున్న వి ద్యార్థులు సేవాభావం, జ్ఞానం, కరుణతో రో గులకు వైద్య సేవలు అందించాలనే సంకల్పానికి ఈ వేడుక ప్రతీకగా నిలుస్తుందన్నారు.


