గోదావరిఖని: సింగరేణి ప్రభావిత ప్రాంతాల యు వతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోంది. సింగ రేణి ఆర్జీ–వన్ ఏరియా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ద్వారా రెండోవిడతగా 121 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని బస్సుల్లో హై దరాబాద్‌కు తీసుకెళ్లారు. మరో 30 మంది త్వరలో నేరుగా హైదరాబాద్‌లో ఉద్యోగాల్లో చేరనున్నారు. ఎల్‌ఎన్ అసోసియేట్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్ విభాగాల్లో పనిచేసేందుకు వీరిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సేవా అ ధ్యక్షురాలు అనిత అభినందనలు తెలిపారు. ఎస్‌వో టూ జీఎం చంద్రశేఖర్, ఎల్‌ఎన్ డైరెక్టర్ కౌశిక్, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్‌కుమార్, సంక్షేమాధికారి గణేశ్ పాల్గొన్నారు.


