ఓటు చోరీపై కాంగ్రెస్‌ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఓటు చోరీపై కాంగ్రెస్‌ పోరాటం

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

పెద్దపల్లిరూరల్‌: కేంద్ర ప్రభుత్వం ఓటుచోరీకి పా ల్పడుతోందని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోరు చేస్తున్నా ఆగడం లేదని కాంగ్రెస్‌ ఉమ్మడి జి ల్లా ఓటుచోరీ ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి శరత్‌కుమార్‌ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, ప్రభుత్వ విప్‌ వి జయరమణారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌తో కలిసి జిల్లా కేంద్రంలో సోమవారం విలేకరుల స మావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్ర ధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవినుంచి తొ లగించే దాకా ఉద్యమం ఆగదని, ఈక్రమంలో న వంబర్‌ 1న ఢిల్లీలో భారీ బహిరంగసభ చేపట్టామని తెలిపారు. విప్‌ విజయరమణారావు, డీసీసీ అ ధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ, ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఎ స్సారెస్పీ నీటిని విడుదల చేయించామన్నారు. మే యర్‌ మహంకాళి స్వామి, మున్సిపల్‌ చైర్మన్లు నూ గిల్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement