గోదావరిఖని: అవినీతికి వ్యతిరేకంగా ప్రతీఒక్కరు పోరాడాలని, సింగరేణి అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారే అవినీతిని కూకటివేళ్లతో తొలగించాలని జీడీకే–11గని ఏజెంట్ చిలుక శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీడీకే–11 గనిపై విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు విధుల్లో నిజాయతీ, పారదర్శకత, నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. అవినీతికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు ఉంటే, మ్యాన్వే వద్ద ఏర్పాటు చేసిన విజిలెన్స్ ఫిర్యాదుల పెట్టెలో వేయాలని అన్నారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రూప్ ఇంజినీర్ నారాయణమూర్తి, గని మేనేజర్ మాథ్యూస్ జాన్సన్, పిట్ సెక్రటరీ నాయిని శంకర్, ఇంజినీర్ దాసరి శ్రీనివాస్, సంక్షేమాధికారి రవీందర్ పాల్గొన్నారు.


