ఆర్టీసీకి దసరా ధమాకా | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి దసరా ధమాకా

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

(లక్షల్లో) (రూ.కోట్లలో)

పండక్కి రూ.37.52 కోట్ల ఆదాయం

బస్సుల్లో 70.12 లక్షల మంది ప్రయాణం

ఆదాయంలో కరీంనగర్‌–2 డిపో మొదటిస్థానం

రెండోస్థానంలో గోదావరిఖని డిపో

కరీంనగర్‌ టౌన్‌: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌కు కనకవర్షం కురిసింది. ఈ నెల 9 నుంచి 26 వరకు రూ.37.52 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పండక్కి రీజియన్‌ పరిధిలో కరీంనగర్‌– జేబీఎస్‌ మధ్య 2,425 ప్రత్యేక బస్సులు నడిపించారు. 11 డిపోల ద్వారా 70.12 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు ఆర్‌ఎం, డీఎంలు, ఇతర అధికారులు బస్టాండ్లలో మకాం వేసి రద్దీ అనుకూలంగా సర్వీసులు నడపడంతో ఆర్టీసీకి దసరా బోనాంజ అందినట్లయింది.

మొదటిస్థానం కరీంనగర్‌–2 డిపో

డిపోల వారీగా కరీంనగర్‌–2 డిపో రూ.5.95 కోట్ల ఆదాయంతో రీజియన్‌ పరిధిలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని డిపో రూ.5.50 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో సిరిసిల్ల డిపో 93శాతంతో ప్రథమస్థానంలో, హుజూరాబాద్‌ డిపో 92శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. కిలోమీటరుకు ఆదాయంలో సిరిసిల్ల డిపో రూ.59తో అగ్రస్థానంలో నిలవగా, హుజూ రాబాద్‌ డిపో రూ.58.35తో తర్వాతి స్థానంలో ఉంది. ప్రయాణికుల సంఖ్యలో గోదావరిఖని డిపో ముందంజలో నిలిచింది. ఈ డిపో ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. రీజియన్‌ పరిధిలో సగటు ఆక్యుపెన్సీ రేషియో 83శాతంగా, కిలోమీటరుకు సగటు ఆదాయం రూ.54.47గా నమోదైంది. మొత్తం బస్సులు 68.89 లక్షల కిలోమీటర్లు తిప్పగా, 70.12 లక్షల మంది వారిగమ్యస్థానాలకు చేరుకోగా రూ.37.52 కోట్ల ఆదాయం సమాకూరింది.

డిపో ప్రయాణికులు ఆదాయం

గోదావరిఖని 10 5.50

హుస్నాబాద్‌ 5.44 2.28

హుజూరాబాధ్‌ 6.33 2.84

కరీంనగర్‌–1 8.23 3.98

కరీంనగర్‌–2 7.55 5.95

మంథని 3.41 2.18

జగిత్యాల 8.90 4.45

కోరుట్ల 5.21 2.69

మెట్‌పల్లి 5.03 2.39

సిరిసిల్ల 4.83 2.50

వేములవాడ 5.19 2.70

మొత్తం 70.12 37.52

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement