రామగిరి: రాణీరుద్రమదేవి క్రీడాప్రాంగణాన్ని క్రీడలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఏఐటీ యూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావు కోరా రు. బుధవారం ఆర్జీ–3 ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఎం.రాంచందర్‌రెడ్డి అధ్యక్షతన జీఎం మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. క్రీడా ప్రాంగణంలో ని టెన్నిస్ కోర్టులో ఎర్రమట్టి పోసి బౌండరీ ఏర్పా టు చేయడంతోపాటు మెస్ సదుపాయం కల్పించా లని కోరారు. క్రికెట్ నెట్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలని, సింగరేణి కార్యక్రమాల సమయంలో తొలగిస్తున్న గోల్ పోస్టుల స్థానంలో అవసరమైనప్పుడు తీసి, తిరిగి ఏర్పాటు చేసుకునేలా మొబైల్ గోల్ పోస్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. స్పో ర్ట్స్ కో ఆర్డినేటర్ సదానందం, సీని యర్ స్పోర్ట్స్ ప్రతినిధి కేవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


