ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏరియాలోని వైసీవోఏ క్లబ్లో నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ఏరియా జీఎం వీసం కృష్ణయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నా రు. పోటీల్లో ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియాల జట్టు విజేత గా, భూపాలపల్లి, ఆర్జీ–3 ఏరియాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడా ప్రతినిధులు అజ్మీర తుకారాం, బి.నాగేశ్వరరావు, సుందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అశోక్, పోస్నెట్, నరేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, శ్రా వణ్, జాకబ్, కాంతారావు, ప్రసాద్ పాల్గొన్నారు.


