గోదావరిఖని: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వద్దన్న బాణంతోనే ప్రభుత్వంపై గురిపెట్టారు. పార్టీ అనుబంధ టీబీజీకేఎస్‌ను బలోపేతం చేసి సింగరేణిలో పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
కార్మికుల పక్షాన నిలిచినా..
బీఆర్‌ఎస్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో నిలిచింది. కారుణ్య నియామకాలు, ఉ చిత విద్యుత్, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, రూ.10 లక్ష లు వడ్డీలేని రుణంలాంటి అనేక సంక్షేమ కార్యక్రమా లు కల్పించింది. అయినా, కార్మికులు గుర్తింపు కార్మి క సంఘం ఎన్నికల్లో టీబీజీఎస్‌ను ఎందుకు ఆదరించలేదనే అంతర్మథనం మొదలైంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. యూనియన్ నేతలు వెంకట్రావ్, మి ర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు టీబీజీకేఎస్ దూరంగా ఉండాలని ఆదేశించారు. అప్పటిదాకా బలంగా ఉన్న టీబీజీకేఎస్ ఆ తర్వాత బలహీనపడిపోయింది. దీంతో చాలామంది ఇతర యూనియన్లకు వలసపోయారు. కొన్ని ప్రాంతాల్లో వలసలు యూనియన్ల గెలుపోటములు ప్రభావితం చేశాయి.
గత గుర్తింపు ఎన్నికలకు దూరంగా..
2023 డిసెంబర్ 27న గుర్తింపు కార్మిక సంఘం ఎ న్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వా త బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం యూనియన్ నాయకత్వాన్ని విస్మయానికి గురిచేసింది. అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రా వు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు.
ప్రత్యర్థి సంఘాలకు అవకాశం
టీబీజీకేఎస్ ఎన్నికలకు దూరం కావడంతో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏఐటీ యూసీ గుర్తింపు సంఘంగా విజయం సాధించగా, ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా అవతరించింది. అప్పటిదాకా గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ తనస్థానం కోల్పోయింది.
గురిపెట్టిన కేటీఆర్..
కోల్‌బెల్ట్‌ప్రాంతంలోని 12 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో 11 నియోజవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. అన్నిహక్కులు కల్పించడం.. ప్రధానంగా కారుణ్య నియామకాలు కల్పించడంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అహర్నిశలు శ్ర మించారు. దీంతో సింగరేణి కార్మికుల పిల్లలకు సంస్థలో డిపెండెంట్ ఉద్యోగ హక్కు పొందారు. దీంతో పాటు అనేక హక్కులను సాధించి పెట్టడంలో బీఆర్‌ఎస్ ముందున్నా కేవలం గుర్తింపు యూనియన్ టీ బీజీకేఎస్‌కు చెడ్డపేరు కారణంగానే ఓటమి పాలైందనే నివేదికలతో కేసీఆర్.. టీబీజీకేఎస్‌ను పోటీ నుంచి పక్కన బెట్టారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మూడేళ్ల తర్వాత సింగరేణి గడ్డపై బీఆర్‌ఎస్ అదే టీబీజీకేఎస్‌ను ముందుంచి అధికార పార్టీపై కేటీఆర్ బాణం ఎక్కుపెట్టారు. బుధవారం జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభకు అనూహ్యంగా జనం హాజరు కావడడంతో భవిష్యత్‌లో యూనియన్‌ను మరింత బలోపేతం చేసి గుర్తింపు యూనియన్‌గా టీబీజీకేఎస్‌ను గెలిపించే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.


