పెద్దపల్లి: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఎన్నికల అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఫలితాలు ప్రకటించారు. జిల్లా చైర్మన్‌గా ఎర్రబాటి వెంకటేశ్వర్‌రావు, వైస్ చైర్మన్‌గా సాదుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పంపాటి శ్రీకాంత్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కావేటి రాజగోపాల్, ఉప్పు రాజ్‌కుమార్, గంట్ల రామచంద్రారెడ్డి, మహమ్మద్ అబ్దుల్ ముయీద్, మేడగోని వెంకటేశ్, అల్పూరి సంపత్‌రావు, వెల్పు ల రమేశ్, గొల్లా అంజన్ కుమార్, దూడం వెంకట సాంబమూర్తి ఎన్నికయ్యారు. వీరితో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు
పెద్దపల్లి: బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈనెల 28, 29, 30వ తేదీల్లో చేపట్టనున్న సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు. వారానికి ఐదు రోజుల పనివిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన ఒప్పందంలోని మిగిలిన డిమాండ్లను పరిష్కరించడంతోపాటు ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలోని లోపాలను సరిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సిపిల్లి రవీందర్, పైడిపల్లి నాగయ్య, నరేశ్, ఎండీ ఖాజా, ఇరుగురాళ్ల లచ్చయ్య, ఎండీ ముస్తఫా, నగేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


