యోగా సాధనతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగా సాధనతో ఆరోగ్యం

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

పెద్దపల్లి: యోగా సాధనతో వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారని సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ అన్నారు. సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో శనివారం యోగా డే నిర్వహించారు. వృద్ధుల పోషణ, సంరక్షణ, సంక్షేమంపై రూపొందించిన ఎల్డర్‌ గైడ్‌ పుస్తకాలు, అవగాహన పోస్టర్లను ఆయనకు అందజేశారు. వృద్ధుల సమస్యలు, అవసరాలు, సాయం కోసం హెల్ప్‌లైన్‌ 14567కు సమాచారం అందించాలని రమేశ్‌ సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన బోర్డులు, పోస్టర్లు అందజేశారు. జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్‌ రాజయ్య, ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత, క్యాడర్‌ స్కూల్‌ అధ్యక్షుడు సతీశ్‌, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement