పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న విద్యాశాఖ ద్వారా ప్రభు త్వ బడులను మరింత బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం సింగపూర్ దేశంలో పూర్వ ప్రాథమిక, ప్రా థమిక విద్య అమలు తీరుపై అధ్యయనం చేసేందు కు జిల్లా విద్యాధికారి శారదతోపాటు అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, ధర్మారం మండలం రచ్చపల్లి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయు డు వంశీమోహనాచార్యులు ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు పర్యటించారరు. ఎక్స్‌ప్లోర్ విజిట్‌లో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎ న్‌ఐఈ) సందర్శించినట్టు అధికారులు తెలిపారు.
బడ్జెట్‌లో 12శాతం నిధులు
సింగపూర్‌లో విద్యారంగానికి బడ్జెట్‌లో 12శాతం నిధులు కేటాయిస్తున్నట్టు జిల్లా నుంచి వెళ్లిన విద్యాధికారుల అధ్యయనంలో వెల్లడైంది. ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ప్రాథమిక విద్యను అందిస్తారు. ఆరో తరగతిలో ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామ్ (పీఎస్‌ఎల్‌ఈ) నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీ–3 అంటే.. టాపర్, జీ–2 అంటే సాధారణ, జీ–1 అంటే నెమ్మదిగా విద్యార్థుల నైపుణ్యం ఉన్నట్టు నిర్ధారిస్తారు. అలా వారికి ఉన్నత విద్యను అందిస్తున్నారు.
స్కూళ్లలో బోధన మరింత పటిష్టతకు చర్యలు
సింగపూర్‌లో విద్యారంగం అమలుపై అధ్యయనం
ఈనెల 12నుంచి 19 వరకు సాగిన అధికారుల పర్యటన


