జీడీకే–10 గనిలో కాపర్‌వైర్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

జీడీకే–10 గనిలో కాపర్‌వైర్‌ చోరీ

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ–3ఏరియా 10 ఇంక్లయిన్‌ మైన్‌లో ఈనెల 13న కాపర్‌ వైర్‌ చోరీకి గురైంది. పోలీసులు కథనం ప్రకారం.. ఈనెల 13న రాత్రి గనిలోకి ప్రవేశించిన దొంగలు.. సుమారు 130 మీటర్ల పొడవైన కాపర్‌వైర్‌ను అపహరించుకెళ్లారు. ఈమేరకు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోగుల స్వామి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రాగితీగ విలువ సుమారు రూ. ఒక లక్ష నాలుగు వేలు ఉంటుందని పేర్కొన్నారు.

ఓసీపీ–2లో కాపర్‌వైర్‌ చోరీకి యత్నం

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌–2 ప్రాజెక్ట్‌ (ఓ సీ–2)లో కాపర్‌వైర్‌ చోరీకి యత్నించిన ఘటనలో ముగ్గురిని సింగరేణి సె క్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. ఓసీ–2 లో ఆది, సోమవారాల్లోని రాత్రివేళలో దుండగులు చోరీకి యత్నంచారు. సోమవారం అర్ధరాత్రి ఓపెన్‌కాస్టులోని పీవో కార్యాలయ సమీపంలో కాపర్‌వైర్‌ను కట్‌ చేస్తుండగా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గమనించి ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన ఓదారి శశాంక్‌, సాదుల వివేక్‌, శివరాత్రి మహేశ్‌తోపాటు కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివరాత్రి రమేశ్‌, ఉదయ్‌ రాజ్‌కుమార్‌, రాజు పరారయ్యారు. ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

గోదావరిఖని: గంజా యి తరలిస్తున్న సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన పిన్నోజి గోపి (24), ఇదే ప్రాంతా నికి చెందిన మాచర్ల పవన్‌కుమార్‌ (19)ను అరెస్ట్‌ చేసిన ట్లు గోదావరిఖని వ న్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గో దావరిఖని బస్టాండ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గమనించి తప్పించుకునేందుకు యత్నించారన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. బ్యాగులో ఎండిన గంజాయి, పండ్లు ఉన్న ప్యాకెట్‌ లభించిందన్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితులు చంద్రపూర్‌, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు పేర్కొన్నారు. వారినుంచి రూ.52వేల విలువైన 1.05కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement