పెద్దపల్లి: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు చేస్తుండగా.. తమ సమస్యలు పరిష్కరించాలని రైస్‌మిల్లర్లు నిరవధిక బంద్ పాటించడం ఆందోళనకరంగా మారుతోంది. పెండింగ్ బిల్లులు, మిల్లింగ్, హమాలీ చార్జీల బకాయిలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటే.. కొత్త సీజన్ ధాన్యం తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడం ఏమిటని మిల్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా రైస్‌మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయని వారు వాపోతున్నారు.
గుదిబండగా విద్యుత్ బిల్లు
విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. మిల్లు నడవకున్నా ప్రతీనెల కనీసం రూ.1లక్ష వరకు, నడిస్తే రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయంటున్నారు. 300 కిలోవాట్ల వరకు యూనిట్‌కు రూ.1 చార్జీ వసూలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిబంధనలపై అభ్యంతరం
ధాన్యం నాణ్యత, తేమ, తిరస్కరణ, నూకల శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా క్వింటాల్‌కు 63 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నూక శాతం అధికంగా వస్తోందని, తద్వారా తాము నష్టపోతున్నామని మిల్లర్లు అంటున్నారు. ముఖ్యంగా సన్నధాన్యం ఔటర్న్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న రైస్‌మిల్లర్ల నిరసన
జిల్లాలో మూతపడిన మిల్లులు


