నిబంధనలకు లోబడి సీఎమ్మార్ చెల్లించిన వారిని, బకాయిదారులను ఒకేమాదిరిగా చూడడం సరికాదు. సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేస్తే ఇబ్బందులు లేవు. కానీ, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి.
– మోరపల్లి తిరుపతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు,
రైస్‌మిల్లర్స్ అసోసియేషన్
ఆంధ్రాలో అలా ఎందుకు?
ఆంధ్రప్రదేశ్‌లో సీఎమ్మార్‌కు క్వింటాల్‌పై రూ.110 చార్జీ చెల్లిస్తున్నారు. మనతెలంగాణలోరూ.10 చెల్లిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ముడిసరుకుల ధరలు, కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలి.
– నగునూరి అశోక్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
అక్టోబరులోనే కొనుగోళ్లు
అక్టోబర్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వానాకాలం ధాన్యాన్ని రైతుల నుంచి యథావిధిగా కొనుగోలు చేస్తాం. ఉన్నతాధికారుల నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే మాకు వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నాం.
– శ్రీరాములు, అదనపు కలెక్టర్


