గడువులోగా పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తి

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

పెద్దపల్లి/ఎలిగేడు: యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్‌తోపాటు ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు, సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల పనులను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆరా తీశారు. ఎస్‌ఐఆర్‌ విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌ కుమార్‌, తహసీల్దార్‌ బషీరోద్దీన్‌, డిప్యూటీ ఈఈ బాబురెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు

పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. ప్రజాపాలన వేడుకల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, అతిథులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నా రు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ, వానాకాలం – 2026 సీజన్‌ ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధి కారి శ్రీనాథ్‌, మేనేజర్‌ శ్రీకాంత్‌, డీసీవో శ్రీమా ల, రవాణా కాంట్రాక్టర్లు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ

గోదావరిఖని: నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పోలీస్‌ అధికారులతో మంగళవారం నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. డీసీపీలు భాస్కర్‌, రాంరెడ్డి, ఏసీపీలు కృష్ణ, ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, నాగేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, ప్రవీణ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధిలో ఇంజినీర్లు కీలకం

కోల్‌సిటీ: నగర పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. ఇంజినీర్స్‌ డేను పురస్కరించుకొని మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని 12 మంది ఇంజినీర్లను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ రామగుండం సౌజన్యంతో సత్కరించి మాట్లాడారు. చిత్తశుద్ధితో సేవలందిస్తూ నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శాంతిస్వరూప్‌, ఏఈలు మీర్‌, తేజస్విని, సౌమ్య, మనోజ్‌, అన్వేష్‌, నవీన్‌, అధికారులు నవీన్‌, అశోక్‌, కల్యాణ్‌, శ్రావణ్‌, శ్రీనివాస్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి కజంపురం రాజేందర్‌, కార్పొరేటర్లు గట్ల రమేశ్‌, వడ్లూరి రవి, కొలని కవిత, బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలు ఇవ్వాలి

పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమంలో పాటలు, డ ప్పులు, ధూంధాం ప్రదర్శనలతో ప్రజలను చై తన్యపరిచిన ఉద్యమ కళాకారులకు ఉద్యోగా లు ఇవ్వాలని నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన కళాకారుల సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడి ఏళ్లు గ డుస్తున్నా కళాకారుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ఇకపై హామీలు కాకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. కళాకా రులు అనువోజు వెంకటేశం, దరువు అంజన్న, నకిరేకంటి కిరణ్‌ కుమార్‌, రజాక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement