పెద్దపల్లి: సింగపూర్‌లో అమలవుతున్న విద్యావిధానాలను అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో కూడిన ప్రతినిధి బృందం నేటినుంచి ఈనెల 19 వరకు ఆ దేశంలో పర్యటించనుంది. బృందంలో మనజిల్లా విద్యాధికారి శారద, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, ధర్మారం మండలం రచ్చపల్లి ఎంపీపీఎస్ ఎస్‌జీటీ వంశీ ఎంపికయ్యారు. విద్యావిధానాలు, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన పద్ధతులు, పరిపాలన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రణాళిక వంటి అంశాలను బృందం అధ్యయనం చేయనుంది. అక్కడి వినూత్న విద్యావిధానాల్లో మన పాఠశాల విద్యా వ్యవస్థకు అన్వయించే అంశాలను గుర్తించడం ద్వారా బోధనలో నాణ్యత, విద్యా పరిపాలన, అభ్యసన ఫలితాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పతాయని డీఈవో శారద వివరించారు.
శారద
షేక్
వంశీ


