జ్యోతినగర్: ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల ఆవరణలోని చెట్టును ప్రత్యేకంగా అలంకరించి విగ్నేశ్వరుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ప్రధానోపాధ్యాయురాలు రేణుక ప్రోత్సాహంతో, గణిత ఉపాధ్యాయురాలు కె.అనిత సహకారంతో ప్రత్యేక ప్రకృతి గల గణేశున్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మట్టి గణనాథులు, గణేశుని చిత్రాలను రూపొందించే పోటీలు శుక్రవారం నిర్వహించారు. ప్రత్యేక గణనాథున్ని తయారు చేసిన 7వ తరగతి విద్యార్థిని బి.స్వాతి ప్రథమ బహుమతి గెలుచుకుంది.


