పొల్యూటెన్‌షన్‌ | - | Sakshi
Sakshi News home page

పొల్యూటెన్‌షన్‌

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

కాలుష్య సుడిగుండంలో రామగుండం గతంతో పోలిస్తే పెరుగుతున్న కాలుష్య స్థాయిలు జిల్లాలో తగ్గుతున్న గాలి నాణ్యత.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం సింగరేణి కాలనీలు, పారిశ్రామిక ప్రాంతాల్లో తీవ్రమవుతున్న శ్వాసకోశ సమస్యలు

సాక్షి, పెద్దపల్లి:

పారిశ్రామిక ప్రగతికి చిరునామా రామగుండం వాయు కాలుష్యంపై ఆందోళన చెందుతోంది. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల కర్మాగారం, సిమెంట్‌ పరిశ్ర మలు, క్రషర్లు, గ్రానైట్‌ యూనిట్లు, మిల్లులు, బొగ్గు రవాణా వాహనాలు.. ఇలా అనేక రకాల పారిశ్రామిక, రవాణా కార్యకలాపాలు గాలిలో దుమ్ము, ధూళి, సూక్ష్మకణాల భారం పెంచుతున్నాయి. ము ఖ్యంగా పీఎం10, పీఎం2.5 స్థాయిలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూ ఐ)లోనూ హెచ్చుతగ్గులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతీనెల కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ ఉంటున్నా క్షేత్రస్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రాంతాలు, ప్రధాన పారిశ్రామిక కూడళ్ల వద్ద ప్రత్యేక శాంప్లింగ్‌ టెస్ట్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి గాలి నాణ్యత అంచనా వేయాలని స్థానికులు కోరుతున్నారు.

పీఎం10.. పీఎం2.5పై నిఘా అవసరం

రామగుండంలో ఇటీవల నమోదైన రీడింగ్‌ గాలి నాణ్యతపై అప్రమత్తత అవసరం సూచిస్తోంది. ఆ గస్టు 26న నమోదైన రీడింగ్‌లో పీఎం2.5, 20.7, పీఎం10– 39.7గా ఉండగా ఏక్యూఐ 73గా నమోదైంది. సెప్టెంబర్‌లో అందుబాటులో ఉన్న ఇతర రి యల్‌టైమ్‌ రీడింగ్‌లో ఏక్యూఐ 119 వరకు నమో దైంది. పీఎం10లో రోడ్డు, నేల దుమ్ము, నిర్మాణం, పరిశ్రమలు, వాహనాల రాకపోకలు, బొగు నుంచి వెలువడే కణాలు ప్రధానంగా ఉంటాయి. పీఎం2.5 మరింత సూక్ష్మమైన కణాలు కావడంతో ఊపిరితిత్తుల లోతైన భాగాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. బొగ్గు, ఇతర ఇంధనాల దహనం, వాహనాల ఉద్గారాలు వంటి వాటినుంచి ఇవి వెలువడతాయి.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం

కాలుష్యమైన గాలిని పీల్చడం ద్వారా శ్వాసకోశ వ్య వస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దగ్గు, గొంతు ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో స మస్యలు, ఆస్తమా వంటి రుగ్మతలు తీవ్రతరం కా వచ్చు. ఇప్పటికే గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్నారులు, వృద్ధులు తది తరులు అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పీఎం10, పీఎం2.5తోపాటు కార్బన్‌ మోనాక్సై డ్‌, సల్ఫర్‌ డయాకై ్సడ్‌, నైట్రోజన్‌ ఆకై ్సడ్‌ వంటి కాలుష్య కారకాల స్థాయిలను కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షించి, డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచితే పరిస్థితిపై పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రీన్‌బెల్ట్‌తో కొంత ఉపశమనం

రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కాలు ష్య నియంత్రణకు గ్రీన్‌బెల్ట్‌ పెంపుతోనే కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన రహదారులు, పరిశ్రమలు, క్వారీలు, బొగ్గు రవాణా మార్గా ల వెంట పచ్చదనం పెంచడంతోపాటు పరిశ్రమల చుట్టూ బఫర్‌ జోన్లు అభివృద్ధి చేయాలి. కాలుష్య ని యంత్రణలో పరిశ్రమలు, సింగరేణితోపాటు స్థాని క సంస్థల పాత్ర కీలకం. మెయిన్‌ రోడ్లపై మెకాని కల్‌ స్వీపింగ్‌, అవసరమైన చోట వాటర్‌ స్ప్రింక్లింగ్‌, రోడ్లపై పేరుకుపోయిన మట్టి, ధూళి తొలగింపు వంటి చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బొగ్గు, ఇసుక, నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలకు కవర్లు తప్పనిస రి చేయాలి. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము ఎగరకుండా చర్యలు తీసుకోవాలి. బహిరంగంగా చెత్త కాల్చడాన్ని అరికట్టాలి. ఇలాంటి చర్యలతో నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ వాయు సర్వేక్షణ – 2026లో రాష్ట్రంలోనే మొదటిస్థానం దక్కించుకుంది.

దుమ్మే పెద్దసమస్య

ఓపెన్‌కాస్ట్‌లు, బొగ్గు రవాణా మార్గాలు కాలుష్య నియంత్రణకు ప్రధాన సవాలుగా మారుతున్నాయి. ఓపెన్‌కాస్ట్‌లో బ్లాస్టింగ్‌లు, తవ్వకాలు, బొగ్గు తరలింపు సమయంలో ధూళి గాలిలో కలుస్తున్నాయి. దీనికి వాహనాల ఉద్గారాలు తోడవుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, బొగ్గు ధూళి వాహనాల రాక పోకలతో మళ్లీ గాల్లోకి చేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement