● క్రైం పారామీటర్లలో పోలీసుల దూకుడు ● క్లస్టర్–2లో అగ్రస్థానంలో కమిషనరేట్ ● పోలీస్ అధికారులకు డీజీపీ ప్రశంసలు
గోదావరిఖని: నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పోలీసింగ్ పనితీరులో రామగుండం పోలీస్ కమిషనరేట్ సత్తా చాటింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్లలో గత ఆరునెలల పనితీరు సమీక్షించిన అధికారులు.. అత్యుత్తమ పనితీరు కనబరిచిన క్లస్టర్–2లోని రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు మొదటి స్థానం కల్పించారు. క్లస్టర్–1లో హైదరాబాద్, క్లస్టర్–2లో రామగుండం, క్లస్టర్–3లో నల్గొండ, క్లస్టర్–4లో సూర్యాపేట యూనిట్లు అగ్రస్థానాల్లో నిలిచాయని వారు ప్రకటించారు.
క్లస్టర్–2లో నంబర్–1
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పర్యవేక్షణలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచి పనితీరు ప్రదర్శిస్తోంది. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, పా రదర్శకంగా దర్యాప్తు పూర్తిచేయడం, నేరాలను స మర్థవంతంగా నియంత్రించడం, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయడం వంటి అంశాల్లో క్లస్టర్–2లో రామగుండం కమిషరేట్ డీజీపీ సీవీ ఆనంద్ నుంచి ప్రశంసలు అందుకుంది.
బాధితుల వద్దకే పోలీసులు
బాధితులకు పోలీస్ సేవలను మరింత సులభత రం చేసేలా ఆన్‌సైట్‌లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే పద్ధతికి ప్రాధాన్యం రామగుండం పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
రోడ్డు భద్రత, ప్రజాశాంతి పరిరక్షణలో భాగంగా ఈ–చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు విస్తృతంగా చేస్తున్నారు. ఓపెన్ డ్రింకింగ్, టౌన్ న్యూసెన్స్ వంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలపై కేసులు నమోదు చేస్తూ, చిన్నచిన్న నేరాలను ప్రారంభ దశలోనే నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఘటనా స్థలంలోనే ఆధారాల సేకరణ
ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదయ్యే ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డిటెక్షన్ రేటు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. నేరం జరిగిన వెంటనే ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, సమర్థవంతమైన దర్యాప్తు వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
కన్విక్షన్ రేటు పెంపు
కేసు నమోదు, నిందితుల అరెస్టుతోనే ప్రక్రియ పూర్తికాదనే విధానంతో దర్యాప్తులో సేకరించిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడేలా చేస్తూ కన్విక్షన్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నారు.
అధికారులు, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ
వర్టికల్స్ వారీగా సిబ్బంది పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తూ కేసుల పురోగతి, విధుల నిర్వహణ, పనితీరుపై సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పిస్తూ వృత్తి నైపుణ్యం మరింత మెరుగుపరుస్తున్నారు.
సమష్టి కృషికి గుర్తింపు
ఇది అందరి విజయం. దీనిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్స్ గుర్తించాం. గంజా యి రవాణా నిరోధంపై విద్యార్థులో అవగాహన కల్పిస్తున్నాం. నేరాల నియంత్రణలో సమష్టిగా ముందుకు సాగడంతోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.
– అంబర్ కిశోర్‌ఝా, సీపీ, రామగుండం
ఆరునెలల్లో క్లస్టర్–2 వివరాలు
యూనిట్ చార్జిషీట్ డిటక్షన్ రేట్ కన్వెన్షన్ ఇన్వెస్టిగేషన్ స్థానం శాతం శాతం శాతం రోజులు
రామగుండం 65.07 73.46 71,89 35 1
ఖమ్మం 70.56 77.41 86.11 39 2
నిజామాబాద్ 43.76 64.01 78.05 46 3
కరీంనగర్ 58.36 71.70 89.14 39 4
సిద్దిపేట 69.25 76.84 65.99 59 5


