తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

మంథని: వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమం వారివారసుల బాధ్యతేనని మంథని జూనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంథని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధుల సంక్షేమ చట్టం కింద రెవెన్యూ డివిజనల్‌ అధికారి కేసులను విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టులు గరిష్టంగా మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని జడ్జి వివరించారు. వృద్ధుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించా రు. సీనియర్‌ న్యాయవాదులు కె.రఘోత్తంరెడ్డి, సువర్ణ చంద్రశేఖర్‌ వృద్ధుల సంక్షేమ చట్టంలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ, సింగరేణి కార్మికుల పెన్షనర్‌ అసోసియేషన్‌ సభ్యులతోపాటు న్యాయవాదులు కటకం శ్రీనివాస్‌, సదన్‌ కుమార్‌, శశిభూషణ్‌ కాచె తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement