ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

పెద్దపల్లి: ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు సుల్తానాబాద్‌లోని యశోద నరహరి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా వైవీ రావు, ప్రధాన కార్యదర్శిగా కడారి సునీల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పూసల రమేశ్‌ ఎన్నికయ్యారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌ తెలిపారు. మొత్తం 35 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యక్షులుగా కె.రాజారత్నం, జూపాక రామచందర్‌, సహాయ కార్యదర్శులుగా నాంసాని శంకర్‌, శనిగరపు చంద్రశేఖర్‌, నూనేటి రాధమ్మ, కోశాధికారిగా రెడ్డపాక లక్ష్మణ్‌తోపాటు కార్యవర్గసభ్యులు, ఆఫీస్‌ బేరర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement