న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Feb 21 2026 8:03 AM | Updated on Feb 21 2026 8:03 AM

న్యూస

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌

ప్రతిభావంతులకు ప్రశంస

పెద్దపల్లి: విద్యాశాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అభినందనలు తెలిపా రు. ఈనెల 17న హైదరాబాద్‌లో సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విద్యార్థుల కోసం నిర్వహించిన రాష్ట్రస్థా యి క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన 20 మంది వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. ఇందు లో జూలపల్లి మండలానికి చెందిన బడుగు సందీప్‌, కమాన్‌పూర్‌ జెడ్పీ హైస్కూల్‌కు చెంది న ఎడునూరి పౌర్ణమి, రొంపికుంట జెడ్పీహె చ్‌ఎస్‌కు చెందిన కటకం శ్రీరామ్‌ చరణ్‌ ఉన్నా రు. ఐఈ కో ఆర్డినేటర్‌ కవిత పాల్గొన్నారు.

మహిళా సంక్షేమంపై శ్రద్ధ

సుల్తానాబాద్‌రూరల్‌: మహిళా, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, దీ నిపై అందరికీ అవగాహన ఉండాలని జెడ్పీ సీ ఈవో నరేందర్‌ తెలిపారు. కాట్నపల్లి రైతు వేదికలో శుక్రవారం పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలనపై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కో సం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహా రం అందిస్తున్నామన్నారు. మహిళలపై వేధింపులు, గృహ హింసతో ఇబ్బందులు పడేవారికి సఖి కేంద్రాలు అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు అండ

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగులకు ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని ఎన్బీ సీ సభ్యుడు, యూనియన్‌ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ పీటీఎస్‌లోని యూనియన్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తమ యూనియన్‌ అగ్రభాగాన ఉంద న్నారు. ఉద్యోగుల హక్కుల సాధన, కాంట్రా క్టు కార్మికుల వేతన సవరణలో కీలకపాత్ర పో షిస్తున్నామని అన్నారు. అనంతరం నాయకు లు ఆయనకు గజమాల వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ మజ్దూ ర్‌ యూనియన్‌ నాయకుడు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్‌, నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

గోదావరిఖనిటౌన్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక ప రీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వీడ్కోలు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని భవిష్యత్‌లో రాణించాలన్నారు. కళాశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వి ద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపా ల్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి కల్పన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌1
1/3

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌2
2/3

న్యూస్‌రీల్‌

న్యూస్‌రీల్‌3
3/3

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement