ప్రామాణిక పుస్తకాలు చదవాలి
న్యూస్‌రీల్
● విడుదలైన
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్
● దగ్గర పడుతున్న
దరఖాస్తుల సమయం
● కొలువు సాధించడం
కష్టమేం కాదంటున్న
ఐఏఎస్, ఐపీఎస్‌లు
● సిలబస్‌పై పట్టు.. ప్రణాళిక.. చిత్తశుద్ధి ముఖ్యమంటున్న ఉమ్మడి జిల్లా బాస్‌లు
నోటిఫికేషన్ విడుదల: 4 ఫిబ్రవరి 2026
దరఖాస్తుకు చివరి తేదీ:
24 ఫిబ్రవరి 2026
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 24 మే 2026
మెయిన్స్ పరీక్ష ప్రారంభం:
21 ఆగస్టు 2026
మొత్తం ఖాళీలు : 933
గరీమా అగ్రవాల్, ఐఏఎస్, కలెక్టర్, రాజన్నసిరిసిల్ల
సిరిసిల్ల: ప్రామాణిక పుస్తకాలు చదువుతూ.. సిలబస్‌పై పట్టు సాధించాలి. నేను 2019లో ఆల్ ఇండియా సివిల్స్‌లో 40వ ర్యాంకు సాధించాను. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారు జనరల్ స్టడీస్(జీఎస్)ను సమగ్ర అధ్యయనం చేయాలి. జీఎస్–1, జీఎస్–2, జీఎస్–3 అంశాలను క్షుణ్ణంగా చదవాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) వెలువరించిన పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని చదవాలి. యూపీఎస్‌సీలో ప్రిలిమినరీ మెట్టు. అది దాటితే చాలా అంశాలు తెలుస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం. పోటీ అంశాలు ఏమిటి..? కోచింగ్ ఏమైనా తీసుకోవాలా..? అనే అనేకాంశాలు తెలుసుకుని మెయిన్స్‌కు ప్రిపేర్ కావచ్చు. మనం ఎన్ని గంటలు చదివాం అనేది ముఖ్యం కాదు.. సమగ్రంగా చదివామా లేదా.. అందులో ఉన్న అంశాలను మనం గ్రహించి గుర్తుంచుకునేలా ఉండాలి. ఏదైనా ప్రణాళికాబద్ధంగా పట్టుదలగా చదవాలి. పరీక్ష హాల్‌లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా.. సరైన సమాధానాలను నిర్దేశించుకుని, అక్షరాలను వేగంగా, అందంగా రాయడమూ ముఖ్యమే. సమయపాలన చాలా అవసరం. రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఏ అంశమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా.. మానసికంగా ఉల్లాసంగా ఉంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. తొలి ప్రయత్నం విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ.. పట్టుదలగా ముందుకు సాగాలి.
సివిల్స్ కొట్టు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్.. ఏటా వెలువడే నోటిఫికేషన్ కోసం డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎందరో ఎదురుచూస్తుంటారు. లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి సంఖ్య వందల సంఖ్యలోనే ఉంటుంది. అయినా సివిల్స్ రాయాలని అందరికీ ఉంటుంది. ఏటా లక్షలాది మంది పోటీ పడినా లక్ష్యం చేరేది కొందరే. అందుకే సివిల్స్ ప్రత్యేకమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సిలబస్‌పై పట్టు.. ప్రణాళిక.. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే విజయం సులభం అంటున్నారు ఉమ్మడి జిల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఒకసారి ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. భయాన్ని వీడి.. సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలని, ఇందుకు శిక్షణ కన్నా చిత్తశుద్ధి ముఖ్యమంటున్నారు. సివిల్స్‌కు ఎలా సన్నద్ధం కావాలి..?
సిలబస్ ఏమిటి..? ప్రణాళిక..? తదితర సలహాలు.. సూచనలు వారి మాటల్లోనే..
ప్రామాణిక పుస్తకాలు చదవాలి
ప్రామాణిక పుస్తకాలు చదవాలి
ప్రామాణిక పుస్తకాలు చదవాలి
ప్రామాణిక పుస్తకాలు చదవాలి
ప్రామాణిక పుస్తకాలు చదవాలి


