ఫుట్‌పాత్ పనులు ప్రారంభం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని వ్యాపార కూడళ్లు లక్ష్మీనగర్, కల్యాణ్‌నగర్‌లో టీయూఎఫ్‌ఐడీసీ నుంచి సుమారు రూ.20 ల క్షలు వెచ్చించి చేపట్టిన ఫుట్‌పాత్ పనులకు నగర మేయర్ మహంకాళి స్వామి శనివారం భూమిపూజ చేశారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్పొరేటర్లు గట్ల రమేశ్, చిదురాల నాగరాజు, ముస్తాఫా, ధూళికట్ట సతీశ్, నాయకులు కజాంపురం రాజేందర్, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల వి వరాలు అడిగి తెలుసుకొన్నారు. వారి లగేజీలను తనిఖీ చేశారు. రైల్వే పోలీసులు జస్పాల్‌సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రశంస
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల దివ్యాంగ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతి భ కనబర్చారు. ఈనెల 17న హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారని ఎంఈవో సురేందర్‌కుమార్ తెలిపారు. హెచ్‌ఎం రామగిరి సుదర్శనం, సీఆర్పీ వెంకటేశం, సంధ్యారాణి, రజని అభినందించారు.
ఆనందికి బంగారు పతకం
కమాన్‌పూర్(మంథని ): మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది సీఎం కప్ పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించి బంగారు పతకం సాధించింది. హన్మకొండలో శనివారం రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించారు. 18ఏళ్ల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఆనంది అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. తామె తండ్రి నల్లవెల్లి శంకర్. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలిక ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కోచ్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ సుధాకర్, గట్టయ్య, ఎంఈవో విజయ్‌కుమార్ విద్యార్థినిని అభినందించారు.
25న ఎన్టీపీసీ ఆర్‌ఈడీ పర్యటన
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ సదరన్ రీ జియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవిందం సిన్హా ఈనెల 25న రామగుండం ప్రాజెక్టులో పర్య టించనున్నారు. ఈనెల ఉద్యోగ విరమణ చే యనున్న ఆయన రామగుండం ప్రాజెక్టు సందర్శించన చేపట్టడం గమనార్హం. ఈమేరకు అధి కారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఆ యన స్థానంలో రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
పోలీస్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ కానిస్టే బుల్ కూరపాటి శ్రీలత పోలీస్ గేమ్స్ స్పోర్ట్ మీ ట్‌లో రాష్ట్ర స్థా యిలో గోల్డ్‌మె డల్ సాధించా రు. హైదరాబా ద్ గచ్చిబౌలిలో ఈనెల 16 నుంచి 21 వరకు సైబారాబాద్‌లో స్టేట్ లెవల్ పోటీలు నిర్వహించారు. శ్రీలత యోగా అస్టిక్ సింగిల్ విభాగంలో గోల్డ్‌మెడల్, డ్రెడిషనల్ సింగిల్ విభాగంలో రజత పతకం సాధించారు.
ఫుట్‌పాత్ పనులు ప్రారంభం
ఫుట్‌పాత్ పనులు ప్రారంభం
ఫుట్‌పాత్ పనులు ప్రారంభం


