మిగిలింది 38 రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది 38 రోజులే..

Feb 22 2026 7:02 AM | Updated on Feb 22 2026 7:02 AM

మిగిలింది 38 రోజులే..

మిగిలింది 38 రోజులే..

నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్‌ టన్నులు సాధించాల్సింది 20.30 మిలియన్‌ టన్నులు లక్ష్యానికి దూరంగా సింగరేణి బొగ్గు గనులు

గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి నిర్దేశిత లక్ష్య సాధనలో సింగరేణి సంస్థ వెనకబడింది. గతేడాది కన్నా ఈసారి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం పెంచడంతో అ ప్పుడు సాధించిన 70 మిలియన్‌ టన్నులు కూడా వె లికితీయలేకపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు గతేడాది కన్నా 64 లక్షల టన్నులు తక్కువగానే నమోదు చేసింది.

63.06 మిలియన్‌ టన్నులకు సాధించింది 51.70 మిలియన్‌ టన్నులే

ఈనెల 20వ తేదీ వరకు 63.06 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది సింగరేణి లక్ష్యం. కానీ, ఇప్పటివరకు 51.70 మిలియన్‌ టన్నులే సాధించింది. 82 శాతం వరకే నమోదు చేసింది. కొన్నిగనుల జీవితకాలం ముగిసిపోవడం, మరికొన్ని గనుల్లో సరైన విధంగా బొగ్గు ఉత్పత్తి రాకవపోవడంతో ఉ త్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి వెనుబడింది. ప్రధానంగా సంస్థ సీఎండీని పర్మినెంట్‌గా నియమించకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి నూతన బొగ్గు గనుల ఏర్పాటు, ఉన్న గనుల విస్తరణ, మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనుల ఏర్పాటు పూర్తిగా నిలిచిపోయాయి. ఈప్రభావం ఉత్పత్తి, ఉత్పాదకతపై పడుతోంది.

లక్ష్య సాధనలో ఒకేఒక్క ఏరియా..

లక్ష్య సాధనలో సింగరేణిలోని 11 ఏరియాలూ ఆ శించిన మేరకు ముందుకు సాగడంలేదు. సత్తుపల్లి ఏరియా 101శాతం బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉండగా మిగతా ఏరియాలు లక్ష్యం చేరుకోలేకపో తున్నాయి. బెల్లంపల్లి, మణుగూరు, ఆర్జీ–2, కొత్తగూడెం ఏరియాలు ఉత్పత్తి లక్ష్యానికి సమీపంలో ఉండగా, ఏపీఏ ఎంతోదూరంలో నిలిచింది. 11శా తమే ఉత్పత్తి సాధించి చివరిస్థానంలో ఉంది.

సీఎండీ ప్రత్యేక దృష్టి

ఈనెల 11న బాధ్యతలు స్వీకరించిన సింగరే ణి సీఎండీ జ్యోతిబుద్ధప్రకాశ్‌.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఏరియాల వారీగా ఉత్పత్తి లక్ష్య సాధనపై సమీక్షిస్తున్నారు. ప్రతీరోజు సాధించాల్సిన ఉత్పత్తిపై ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా.. వార్షిక ఉత్పత్తి లక్ష్యం సాధించడం కష్టమని భావిస్తున్నారు.

సింగరేణిలోని 12 ఏరియాల్లో

ఈనెల 20వ తేదీవరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి(లక్షల టన్నుల్లో)

ఏరియా టార్గెట్‌ సాధించింది శాతం

ఆర్జీ–వన్‌ 39.72 33.65 85

ఆర్జీ–2 84.40 78.89 93

ఆర్జీ–3 57.07 42.74 75

ఏపీఏ 13.43 01.51 11

భూపాలపల్లి 40.74 26.00 64

కొత్తగూడెం 89.98 83.35 93

సత్తుపల్లి 47.84 48.21 101

ఇల్లెందు 43.02 22.41 52

మణుగూరు 101.25 93.02 92

బెల్లంపల్లి 30.62 29.95 98

మందమర్రి 24.57 16.51 67

శ్రీరాంపూర్‌ 57.88 40.76 70

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement