ప్రాక్టీస్‌తోనే అవగాహన
శివమారుతి రెడ్డి, ఐపీఎస్, గ్రేహౌండ్స్ ఏఎస్పీ, ఒడిశా
కోరుట్ల: సివిల్స్ సాధించడానికి సిలబస్‌పై పూర్తి పట్టు సాధించడం కీలకం. మాది కోరుట్ల మండలం అయిలాపూర్. రెండేళ్ల క్రితం సివిల్స్‌కు ఎంపికయ్యాను. 132వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఒడిశా గ్రేహౌండ్స్ విభాగంలో అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్నా. సివిల్స్‌లో సిలబస్‌ను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని ఒక్కో అంశాన్ని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలి. డెవలప్‌మెంట్స్‌పై దృష్టి సారించాలి. మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌లో చక్కని ఫలితం సాధిస్తే మెయిన్స్ పెద్ద కష్టం కాదు. ఆప్షనల్స్‌లో ప్రతీ అంశంపై పట్టు సాధించడం అవసరం. మెయిన్స్‌లో గత పరీక్షల ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. అంతకుముందు సివిల్స్ టాపర్లుగా నిలిచిన వారి కాపీలను స్టడీ చేసి నోట్స్ సొంతంగా తయారు చేయాలి. ఇంటర్వ్యూలో మన కాన్ఫిడెన్స్ లెవల్స్‌ను పరిశీలిస్తారు. చదివేటప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ కావడం కీలకం.


