బదిలీవర్కర్‌.. ఇక కనుమరుగు | - | Sakshi
Sakshi News home page

బదిలీవర్కర్‌.. ఇక కనుమరుగు

Feb 21 2026 8:03 AM | Updated on Feb 21 2026 8:03 AM

బదిలీవర్కర్‌.. ఇక కనుమరుగు

బదిలీవర్కర్‌.. ఇక కనుమరుగు

జనరల్‌ అసిస్టెంట్‌ ట్రెయినీగానే నియామకం ఏడాదిలో 190/240మస్టర్లు నిండితే పర్మినెంట్‌ జనరల్‌ అసిస్టెంట్‌గా ఆటోమెటిక్‌గా గుర్తింపు

గోదావరిఖని: సింగరేణిలో బదిలీ వర్కర్‌ పోస్టుకు కాలం చెల్లనుంది. ఇకనుంచి జనరల్‌ అసిస్టెంట్‌ ట్రె యినీగానే గుర్తించనున్నారు. జనరల్‌ అసిస్టెంట్‌ ట్రె యినీగా ఉద్యోగంలో ఏడాది పూర్తికాగానే 190/ 240మస్టర్లు నిండితే ట్రెయినీ తొలగించి జనరల్‌ అసిస్టెంట్‌గా పర్మినెంట్‌ చేసేలా గుర్తింపు యూనియన్‌ ఒప్పందం చేసుకుంది. గతంలో ఉద్యోగంలో కి తీసుకునే సమయంలో బదిలీవర్కర్‌గా ఉద్యోగంలోకి తీసుకుని.. ఏడాదిలో పూర్తిస్థాయి మస్టర్లు నిండినా పర్మినెంట్‌ చేయడంలో ఆలస్యం అయ్యేది. ఒక్కోసారి మూడేళ్లవరకు కూడా వేచిచూసే పరిస్థితి ఉండేది. గుర్తింపు యూనియన్‌ ఏఐటీయూసీ.. సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఉద్యోగంలోకి తీసుకునే సమయంలోనే జనరల్‌ అసిస్టెంట్‌ ట్రె యినీగా గుర్తింపు ఇవ్వాలని కోరింది.

వెయ్యి మందికిపైగా ప్రయోజనం

సింగరేణితో గుర్తింపు యూనియన్‌ చేసుకున్న ఒ ప్పందం ద్వారా వెయ్యి మందికిపైగా కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తాజా నిర్ణయం అమలులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement