24 గంటలపాటు నరకయాతన
పెద్దపల్లిరూరల్: సుమారు పాతికేళ్ల క్రితం పెళ్లయి.. ఇద్దరు సంతానం ఉండగా మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ భర్త.. తన మొదటి భార్యను కిడ్నాప్ చేసి హతమార్చేందుకు యత్నించాడు. గురువారం రాత్రి ఈఘటన జరగ్గా శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి కోర్టులో ఏడేళ్లుగా కొనసాగుతున్న విడాకుల కేసులో కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న మొదటి భార్య పద్మనుస్థానిక బస్టాండ్ నుంచి కిడ్నాప్ చేశాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో హతమార్చేందుకు యత్నించాడు. బాధితురాలి తండ్రి మల్లయ్య, బంధువుల సమాచారం ప్రకారం.. 2012లో నూనె వెంకటేశ్ అనే వ్యక్తితో కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేటకు చెందిన ఓదెల మల్లయ్య అనే సింగరేణి ఉద్యోగి (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నివాసం) కూతురు పద్మను ఇచ్చి 2012లో వివాహం చేశాడు. వారికి ఇద్దరు సంతానం. ఇద్దరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలతో వెంకటేశ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఏడేళ్లక్రితం కోర్టును ఆశ్రయించాడు. కానీ, ఇప్పటికే మరొకరిని పెళ్లి చేసుకోగా ఇద్దరు సంతానం..పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నివాసముంటున్నాడు. గురువారం పెద్దపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. అనంతరం పద్మను తన తండ్రి ఓదెల మల్లయ్య మంచిర్యాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కించి పనినిమిత్తం తను కాల్వశ్రీరాంపూర్ వెళ్లాడు. శుక్రవారం వరకూ కూతురు జాడ కానరాకపోవడంతో పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. పెద్దపల్లి బస్టాండ్ నుంచి పద్మను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరపగా.. పద్మ ఆచూకీ తెలిసింది. సుమారు 24గంటలకుపైగా ముళ్లపొదల్లోనే అచేతనావస్థలోఉన్న పద్మను గుర్తించారు. అక్కడి నుంచి వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. పోలీసులు ఈ విషయమై విచారణ జరుపుతున్నారు.
24 గంటలపాటు నరకయాతన


