ఒకేఒక్కడు | - | Sakshi
Sakshi News home page

ఒకేఒక్కడు

Feb 21 2026 8:03 AM | Updated on Feb 21 2026 8:03 AM

ఒకేఒక్కడు

ఒకేఒక్కడు

● జిల్లా నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్నది ఒక్కరే ● ముంచుకొస్తున్న ఆపరేషన్‌ ‘కగార్‌’ డెడ్‌లైన్‌ ● తాజాగా కర్రెగుట్టల్లో పోలీస్‌ కూంబింగ్‌తో సర్వత్రా ఆందోళన ● చర్చనీయాంశమైన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి పేరు

సాక్షి పెద్దపల్లి: మావోయిస్టు పార్టీలో గతంలో ఎంతోమంది నేతలు క్రీయాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లానుంచి ఒకేఒక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో పోలీస్‌కూంబింగ్‌ నేపథ్యంలో జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి పోలీస్‌లకు చిక్కిననట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో జిల్లానుంచి ఉన్నకేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టులు లొంగిపోగా.. వారు తమ స్వగ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలిసి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 17మంది మావోయిస్టు పార్టీలో ఉండగా, జిల్లానుంచి మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టుల ప్రస్థానం ముగియడంతోపాటు మావోయిస్టు రహిత జిల్లాగా మారేందుకు అడుగుపడేందుకు అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement