మీదే పురతర బాధ్యత!
● బల్దియాల్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఏళ్లకాలంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు
● పరిష్కారానికి నగర, పట్టణ ప్రజల ఎదురుచూపులు ● నూతన పాలకవర్గాలపై కొండంత ఆశలు
పట్టణాలు, నగరాలుగా మారుతున్నా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మట్టిరోడ్లు. ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పూర్తికాని డ్రైనేజీలు.. కంపుకొడుతున్న ఖాళీ ప్రదేశాలు.. రహదారులపై పారుతున్న మురుగునీరు.. వెంబడిస్తున్న కుక్కలు.. ఇళ్లలోకి చేరి రచ్చ చేస్తున్న కోతులు.. రోగాలు తెచ్చిపెడుతున్న డంపింగ్ యార్డులు.. ఇలా వందలాది సమస్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరాలు, పట్టణాల ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. పరిష్కరించాల్సిన పాలకులు ఇన్నాళ్లూ పట్టించుకోకపోగా.. నూతన పాలకవర్గాలు, మేయర్లు, చైర్మన్లపైనే ఆయా ప్రాంతాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. – వివరాలు IIలోu
ఇది హుక్‌లోడర్. సుమారు ఐదేళ్లక్రితం రామగుండం బల్దియా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి గౌతమినగర్ డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్‌సీసీ)లో ఇలా నిరుపయోగంగా ఓ మూలన పడేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద డస్ట్‌బిన్‌లను దీనిద్వారా ఎత్తి కంటెయినర్లపై పెట్టి డంపింగ్ యార్డుకు చెత్త తరలించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి దీనిని కొనుగోలు చేశారు. కానీ, ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండాపోయింది.
మీదే పురతర బాధ్యత!


