గోలేటి నుంచి సత్తుపల్లికి కార్మికయాత్ర
గోదావరిఖని(రామగుండం): సింగరేణి పరిరక్షణకు గోలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో టీబీజీకేఎస్ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. కార్మిక సంక్షేమం, సింగరేణి భవిష్యత్తు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి పరిశ్రమ కాంగ్రెస్ హయాంలో ప్రశ్నార్థకంగా మార్చి వేసిందన్నారు. దీన్ని ఎండగడుతూ కార్మికులను, కోల్ బెల్ట్ ప్రజలను చైతన్య పరచడానికి విస్తృతంగా కార్మిక వాడలు, గనులపైకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ హయాంలో 30వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు లేవని విమర్శించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరి యాల రాజిరెడ్డి, జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధా న కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీశ్ పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వర్


