ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
గోదావరిఖని(రామగుండం): పెండింగ్‌లో ఉ న్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ శనివారం అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. గోదావరినది పరీవాహక ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మా ణం చేపట్టామన్నారు. ప్రతిసారి గోదావరి వ రద సమయంలో ఈ నిర్మాణాలు నీటితో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈసారి ప్ర త్యేక నిధులు కేటాయిస్తే మరమ్మతు చేసి పే దలకు అందించే అవకాశం ఉంటుందన్నారు. వైఎస్సార్ సర్కారు హయాంలో సుమారు 18వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికుల బతుకుదెరువు కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈవిషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించి ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు.


