చట్టాలపై అవగాహన ఉండాలి
పెద్దపల్లి: మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, జైలు లీగల్ సర్వీస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వంగార భవానితో కలిసి పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ ఈడీని కలిసిన హెచ్‌ఎంఎస్ కార్యదర్శి
రామగుండం: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంతను శనివారం హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.ఉపేందర్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సంవత్సరంలో ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ఉత్పత్తిలో, తెలంగాణ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ విస్తరణ పనులు వేగంగా జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈడీతో పాటు హెచ్‌ఓహెచ్‌ఆర్, ఏజీఎం హెచ్‌ఆర్ వికె.సిగ్ధర్‌ను కలిశారు. హెచ్‌ఎంఎస్ ప్రతినిధులు కె.సంజీవరావు, సత్యనారాయణ తదితరులున్నారు.
‘టెట్’ ప్రశాంతం
రామగిరి(మంథని): సెంటినరికాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో శనివారం నిర్వహించిన టెట్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం సెషన్‌లో 100 మంది అభ్యర్థులకు 86 మంది హాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 100 మంది అభ్యర్థులకు 92 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలకుడు ఓదెలు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు కొమురయ్య పరీక్ష కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి
పెద్దపల్లి: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని ఆర్టీవో రంగారావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శనివారం పెద్దపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారునికి గులాబీ పువ్వు అందజేసి అభినందనలు తెలిపారు. హెల్మెట్ ధరించని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
రేగడిమద్దికుంట కార్యదర్శి సస్పెన్షన్
పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబా ద్ మండలం రేగడిమద్దికుంట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రూ.4.17లక్షల జీపీ ని ధులు సొంత అవసరాలకు వాడుకున్నట్లు వి చారణలో తేలగా శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేశారు. సదరు కార్యదర్శి ఇంటి పన్ను రూ.2,43,675, మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు రూ.38,500, టీఎస్ బీపాస్ ఖాతా నుంచి రూ.1,35,000 మొత్తం రూ.4,17,175 నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు డీపీవో, ఎంపీడీవోల విచారణలో తేలింది. దీంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడంతో పాటు విచారణ ముగిసే వరకు హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లడానికి వీలులేదని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
చట్టాలపై అవగాహన ఉండాలి


