ఉదయం కూల్.. సాయంత్రం మూన్
జిల్లాలో శనివారం ఉదయం పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఆకాశంలో వోల్ఫ్ మూన్ కనువిందు చేసింది. రెండుమూడు రోజులుగా ఉదయం 10 గంటల వరకు మంచు దుప్పటి వీడడం లేదు. అలాగే నూతన సంవత్సరం మొదటి పౌర్ణమిని ఖగోళ అద్భుతంగా వోల్ఫ్ సూపర్‌మూన్‌ను అభివర్ణిస్తారు. సాధారణ పౌర్ణమి కంటే పెద్దగా ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తూ కనువిందు చేస్తాడు. పెద్దపల్లిలోని శాంతినగర్ హనుమాన్ విగ్రహం మీదుగా దేదీప్యమానంగా ప్రకాషిస్తున్న సూపర్‌మూన్ ‘సాక్షి’ కెమెరాకు అందంగా కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ఉదయం కూల్.. సాయంత్రం మూన్


