మోడల్ ‘మలుపు’
శరవేగంగా మూలమలుపు విస్తరణ నెలాఖరులోగా పనుల పూర్తికి చర్యలు రాజీవ్ రహదారిపై మోడల్ సర్కిల్ నిర్మాణం రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యం
గోదావరిఖని: రామగుండం నగరంలోని సింగరేణి జీఎం కార్యాలయం మూలమలుపు వద్ద రాజీవ్ ర హదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటికాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా దశాబ్దాలుగా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేనేలేదు. ఇక్కడి పరిస్థితి, రోడ్డు దుస్థితిపై ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వాలకు వేలాది ఫి ర్యాదులు, విన్నపాలు వెళ్లాయి. ఈనేపథ్యంలో ఈ ప్రాంతాన్ని యాక్సిడెంట్ ఫ్రీ జోన్‌గా మార్చిన జిల్లా యాంత్రాంగం.. మూలమలుపు, రోడ్డు విస్తరణ పరిష్కార మార్గమని భావించింది. ఈమేరకు అక్కడ ఇటీవల విస్తరణ పనులు ప్రారంభించింది.
ఏటా అనేక ప్రమాదాలు..
జీఎం ఆఫీసు మూలమలుపు వద్ద రాజీవ్ రహదా రిపై ఏటా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. చాలామంది గాయాలపాలవుతున్నారు. వంద ల కొద్దీ వాహనాలు అదుపుతప్పి బోల్తాడుతున్నా యి. రూ.కోట్లలో ఆస్తినష్టం జరుగుతోంది. ప్రధానంగా మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు అదుపు తప్పి బోల్తాపడుతున్నాయి.
రద్దీగా రాజీవ్ రహదారి..
రాజీవ్ రహదారి నిర్మాణం సమయంలోనే అప్పటి స్థలాభావ పరిస్థితుల కారణంగా రోడ్డును కుదించి నిర్మించారు. నగర శివారులోని గోదావరి నదిపై రెండు వంతెనలు కట్టారు. జగ్ధల్‌పూర్ హైవేకు అనుసంధానంగా మారడంతో రాజీవ్ రహదారి భారీవాహనాలతో నిత్యం రద్దీగా మారింది. అతిసమపానికి వచ్చేంత వరకు జీఎం ఆఫీసు మూలమలుపు కనిపించడంలేదు. దీంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ప డుతున్నారు. ఈక్రమంలో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ప్రమాదాలు పెరిగిపోవడంతో ప్రత్యేక సూచిక బోర్డులు, రోడ్డు స్టాఫర్లు ఏర్పా టు చేశారు. అయినా రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి రాక రోడ్డు విస్తరణ అనివార్యమైంది.
శరవేగంగా పనులు
హైవే నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హెచ్‌కేఆర్ .. జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద విస్తరణ పనులు చేపట్టింది. రోడ్డు విస్తరించి మట్టిపోసి రోలింగ్ చే స్తున్నారు. ఇందుకోసం ప్రణాళిక మ్యాప్‌ను ముందే తయారు చేశారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడతాయి.
విద్యుత్ తీగలు తొలగించి..
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచనతో హెచ్‌కేఆర్ సంస్థ రోడ్డు, మూలమలుపు విస్తరణ చేపట్టింది. దీనికి అడ్డుగా ఉన్న హెచ్‌టీలైన్లు ట్రాన్స్‌కో తొలగించగా, ట్రాఫిక్, సివిల్ పోలీస్, సింగరేణి యాజమాన్యం, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు సమావేశమై విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణకు సింగరేణి బీగెస్ట్‌హౌస్ గోడ తొలగించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంచిర్యాల వైపు వెళ్లే క్రాసింగ్‌ను విస్తరించేలా హెచ్‌కేఆర్ పనులు చేస్తోంది. పనులు పూర్తయితే వాహనాల రాకపోకలు క్రమపద్ధతిలో సాగేలా మోడల్ సర్కిల్ నిర్మిస్తున్నారు.
అన్నివి ప్రభుత్వ భాగాల ను సమన్వయం చేసి రో డ్డు, మూలమలుపు విస్తరణ పనులు వేగవంతం చేశాం. ప్రధానంగా ఆర్ అండ్ బీ, సింగరేణి, మున్సిపల్, పోలీసుశాఖ సహకారం తీసుకున్నాం. ప్రమాదభరితంగా మారిన హైవే రోడ్డు విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీజోన్‌గా మారుతుంది. ఈనెలాఖరులోగా విస్తరణ పనులు పూర్తిచేస్తాం. – ఎంఎస్ రాజ్‌ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం
మోడల్ ‘మలుపు’
మోడల్ ‘మలుపు’


