వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ ప్రచురించిన ముసాయిదా ఓట రు జాబితా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ https://tsec.gov.in/voterportal. doలో అందుబాటులో ఉందని కమిషనర్ అ రుణశ్రీ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు ఉంటే, రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో లిఖిత పూ ర్వకంగా సమర్పించాలని ఆమె సూచించారు.
రాష్ట్రాల అభిప్రాయాలు అవసరం లేదా?
పెద్దపల్లి: వలసలను నిరోధించి, గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధిహామీ పథకం అమలుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవ డం శోచనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీ లో ఈజీఎస్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. పేదలకు పనులు కల్పించడం ద్వారా గ్రామీ ణుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చేది ఈజీఎస్ అ ని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ పథకంపై క క్షగట్టిందని, అందుకే మహాత్మా గాంధీ పేరును సహించలేకపోతోందని ఆయన మండిపడ్డారు.
‘ఎగ్జిబిషన్’లో ప్రతిభ
ముత్తారం(మంథని): వేస్టేజ్ వెల్త్ ఎగ్జిబిషన్‌లో స్థానిక కేజీబీవీ విద్యార్థినులు ప్రథమ, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు తృతీ య స్థానంలో నిలిచారు. కేజీబీవీ బయో సైన్స్ ఉపాధ్యాయురాలు తోట రాధిక ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పాసికంటి రేనాశ్రీ, వేల్పుల కార్తీక, ఎనిమిదో తరగతి బాలిక కలవేన రిషిత.. పనికి రానివస్తువులతో పనికివచ్చేలా తయారు చేసిన వస్తువులు ప్రదర్శించా రు. వీరిని ఎన్‌జీసీఎస్ ప్రతినిఽధి అంజనీకుమా ర్, ఎంఈవో హరిప్రసాద్, ప్రధానోపాధ్యాయు డు ఇరుగురాల ఓదెలు అభినందించారు.
వాలీబాల్ కోచ్‌గా కుమార్
ధర్మారం(ధర్మపురి): హి మాచల్‌ప్రదేశ్‌లో జరిగే 69 వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయస్థాయి అండ ర్–14 బాలుర వాలీబాల్ కోచ్‌గా కటికెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యా యుడు తమ్మనవేని కుమార్ ఎంపికైనట్లు తె లంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. ఆయనను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ లక్ష్మణ్, మేడారం సర్పంచ్ వీర్‌పాల్, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అభినందించారు.
క్వింటాల్ పత్తి రూ.7,414
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,414 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,011గా, సగటు రూ.7,111గా ధర ఉందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 258 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
సీట్‌బెల్ట్ ధరించాలి
పెద్దపలి: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లతోపాటు ముందు సీట్లో కూర్చున్న వారు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని ఆర్టీవో రంగారావు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేశారు.
అఖండ శరణు ఘోష
రామగుండం: ఎన్టీపీసీలోని శ్రీఅయ్యప్ప ఆలయంలో గురువారం అర్ధరాత్రి వరకు అఖండ శరణుఘోష నిర్వహించారు. లోక కల్యాణార్థం ఈ కార్యక్రమం చేపట్టారు.
గవర్నర్‌ను కలిసిన ఠాకూర్
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలి శారు. ఈసందర్భంగా పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా
వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా
వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా
వెబ్‌సైట్‌లో ఓటరు జాబితా


