అభ్యంతరాలు తెలియజేయాలి
పెద్దపలి: జిల్లాలోని రామగుండం మున్సిపల్ కా ర్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబా ద్ మున్సిపాలిటీల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మొత్తం 124 వార్డులు/డివిజన్లలో 2,58,059 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితా సిద్ధం చేశామన్నారు. తన కార్యాలయంలో శుక్రవా రం ఓటరు జాబితాపై సమీక్షించారు. ఓటరు జాబి తా తయారీపై ఈనెల 5న మున్సిపల్ కార్యాలయాలు, 6న కలెక్టరేట్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతామన్నారు. కాగా, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీతో కలిసి తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. ప్రతినిధులు డి.శ్రీనివాస్, బడి ప్రకాశ్, పి.సంపత్‌కుమార్, ఆర్.పద్మావతి, రాపెల్లి రాముడు, సీహెచ్ అనిల్ కుమార్, బి.లక్ష్మి, నుగూరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
గురుకులాల్లో 5 నుంచి 6వ తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీ, జనరల్ కేటగిరీల విద్యార్థులు ఈనెల 21వ తేదీలోగా https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దర ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


