పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
స్వల్ప వడ్డీతోనే రుణాలు మంజూరు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు ‘వడ్డేపల్లి’ పీఎం విశ్వకర్మయోజనపై పథకంలబ్ధిదారులకు అవగాహన
పెద్దపల్లిరూరల్: పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రా మికవేత్తలుగా ఎదగాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ జా తీయ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ సూచించారు. రెండోవిడత రూ.2లక్షల రుణం మంజూరైన లబ్ధిదారులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం అవగాహన స దస్సు నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్ డై రెక్టర్ దశరథ్, లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్, ఇండస్ట్రియల్ మేనేజర్ కీర్తికాంత్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అ ధికారులతో కలిసి రాంచందర్ మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు పర్వతాలు, నిర్మల తదితరులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఆర్థికాభ్యున్నతి సాధించేలా ప్రోత్సాహం
చేతివృత్తిదారుల ఆర్థికాభ్యున్నతి కోసం ప్రధాని మోదీ అమల్లోకి తీసుకొచ్చిన పీఎం విశ్వకర్మ పథ కం ద్వారా షరతులు లేకుండా స్వల్పవడ్డీకే రుణం మంజూరు చేస్తున్నామని రాంచందర్ అన్నారు. బ్యాంకర్లు కొర్రీలు పెడితే లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను కలవాలని, అయినా పరిష్కారం కాకపోతే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో విక్రయాలపై అవగాహన
ఉత్పత్తి చేసిన వస్తుసామగ్రిని ఆన్‌లైన్‌లో విక్రయించే విధానంపై సదస్సులో అవగాహన కల్పించారు. అమెజాన్ తదితర కార్పొరేట్ కంపెనీల తరహాలో ప్రభుత్వం రూపొందించిన ఓఎన్‌డీసీ యాప్‌లో ప్రొడక్షన్ వివరాలు నమోదు చేసే విధానాన్ని ఈ సందర్భంగా వివరించారు. డిజిటల్ పేమేంట్ కోసం తపాలా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అందుకు సంబంధించిన స్కానర్లను లబ్ధిదారులకు అందించారు.
జిల్లాలో 9వేల మందికి రుణాలు
పీఎం విశ్వకర్మయోజన ద్వారా జిల్లాలో తొలివిడత సుమారు 9వేల మందికి రుణాలు మంజూరు చేశామని, అందులో 600 మంది రుణ వాయిదాలను చెల్లించడం లేదని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్ తె లిపారు. తొలివిడత పొందిన రూ.లక్ష రుణ వాయిదాలను సకాలంలో చెల్లించిన వారికే రెండోవిడత రుణాలు అందిస్తారని అధికారులు తెలిపారు.
అధికారులతో వాగ్వాదం...
తమను లబ్ధిదారులుగా ఎంపిక చేసినా సిబిల్ స్కోర్ లేదని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడం లేదని పలువురు అధికారులతో వాదనకు దిగారు. బ్యాంకు నిబంధనలు అంగీకరించక సిబిల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నారని అధికారులు వారిని సముదాయించారు. నిబంధనలకు లోబడి ఉన్నవారికి జాప్యం లేకుండా రుణం అందుతుందని వివరించారు.
పథకం కింద అందించే పనిముట్లు
పీఎం విశ్వకర్మ ద్వారా చేతివృత్తుల వారికి రుణాలు అందిస్తున్నారు. ఇందులో బాస్కెట్, మ్యాట్, బోట్ మేకర్‌తో పాటు కార్పెంటర్, సుతారి(మేసీ్త్ర), ఫుట్‌వేర్, చెప్పులు, బొమ్మలు, చేపలు పట్టే వల తయారీ, నగల వర్క్(గోల్డ్‌స్మిత్), టూల్‌కిట్ మేకర్, కుమ్మరి, టైలరింగ్(దర్జీ), వాషర్‌మెన్, దోభీ లాంటి చేతివృత్తులు ఉన్నాయి.


