పోడు సాగు చేస్తే చర్యలు
మంథనిరూరల్: రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా పోడు వ్యవసాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య హెచ్చరించారు. గోపాల్‌పూర్ బీట్ పరిధిలోని చిన్నఓదాల రిజర్వ్ ఫారెస్ట్‌లో పోడు వ్యవసాయం కోసం అటవీ ప్రాంతాన్ని చదును చేస్తున్న ట్రాక్టర్‌ను గురువారం పట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా పనులు చేయవద్దన్నారు. పట్టుకున్న ట్రాక్టర్‌ను మంథని రేంజ్ ఆఫీస్‌కు తరలించామని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీ ట్ ఆఫీసర్లు ప్రదీప్, రాంసింగ్, పవన్ పాల్గొన్నారు.


