శివపురికాలనీలో మురుగునీరు
క్రిస్టియన్ కాలనీలో నిలిచిన వర్షపునీరు
రక్త పరీక్షల కోసం పేషెంట్ల బారులు
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా కేంద్రంలోని పలుకాలనీల్లో వర్షపునీరు చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. అస్తవ్యస్తమైన డ్రైనేజీలు, నిర్లక్ష్యంగా వదిలేసిన ఓపెన్‌ప్లాట్లను పందులు, పశువులు, ఈగలు, దోమలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. దోమలు, వైరస్ స్థానికులపై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో చిన్నారుల నుంచి ముసలివారి వరకూ మలేరియా, టైఫాయిడ్, డెంగీ, వైరల్ తదితర జ్వరాల బారినపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. వారిరాకతో శనివారం ఓపీలు, వ్యాధి నిర్ధారణ కౌంటర్లు రద్దీగా మారాయి. పిల్లలు, జనరల్ వార్డులు ఇన్‌పేషెంట్లతో నిండిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
అటు మురుగు.. ఇటు వ్యాధులు
అటు మురుగు.. ఇటు వ్యాధులు
అటు మురుగు.. ఇటు వ్యాధులు
అటు మురుగు.. ఇటు వ్యాధులు