
యూరియా కోసం రైతుల పడిగాపులు
ధర్మారం(ధర్మపురి): నందిమేడారం, పత్తిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. నందిమేడారం పరిధిలో 24, పత్తిపాక పరిధిలో 5 గ్రా మాలు ఉండగా, ప్రైవేట్ దుకాణాల కన్నా వీటికే ప్రభుత్వం అధికంగా యూరియా సరఫరా చేస్తోంది. నాలుగు రోజులుగా రోజూ ఒక్కోలారీ లోడ్ వ స్తోంది. రైతులు రెట్టింపు సంఖ్యలో ఉండడంతో యూరియా సరిపోవడంలేదు. రెండ్రోజుల క్రితం మేడారం సింగిల్‌విండోకు 340 బస్తాల యూరియా చేరగా.. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 170 మందికి అందించారు. మిగతావారికి శనివారం వ స్తుందని చెప్పడంతో తమ ఆధార్‌కార్డులను సిబ్బంది వద్దే ఉంచారు. శనివారం 270 బస్తాలు రావడంతో సాయంత్రం వరకూ క్యూలో ఉన్నవారిలో 148 మందికే యూరియా అందించారు. మిగతా వారికి సోమవారం అందిస్తామని చెప్పి ఇళ్లకు పంపించా రు. సకాలంలో వరి పంటకు యూరియా వేయకుంటే దిగుబడి తగ్గుతుందనే నిరాశతో రైతులు ఇంటిదారిపట్టారు. సింగిల్‌విండో గోడౌన్ ఇన్‌చార్జి కుమా ర్ మాట్లాడుతూ, ప్రతీరైతుకు అందిస్తామన్నారు.