
నీట మునిగిన సమ్మక్క – సారలమ్మ గద్దెలు
గోదారిఖని సమీపంలో నీట మునిగిన సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంతం
జలమయమైన పుష్కరఘాట్లు
కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్(రామగుండం): గోదావరిఖని గంగానగర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద గోదా వరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా వరద వస్తుండడంతో నది నిండుకుండలా మారింది. పుష్కరఘాట్స్‌తోపాటు సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలలు నీటమునిగాయి. రాజీవ్ రాజీవ్ రహదారి నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దె వరకు ప్రధాన దారి కూడా వరదనీటితో నిండిపోయింది. భక్తులు వెళ్లకుండా పుష్కరఘాట్స్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహాన్ని వీక్షించడానికి జనాల భారీగా తరలివస్తున్నారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం గోదావరి బ్రిడ్జితోపాటు పుష్కరఘాట్స్, శ్మశానవాటిక ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు.
తగ్గని గోదావరి ఉధృతి
మంథని: పట్టణ సమీపంలోని గోదావరి నది వరద ఉధృతి మూడోరోజు శనివారం కూడా కొనసాగుతోంది. సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీలో 8,09,471 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అదేస్థాయిలో గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో పరీవాహక ప్రాంతం నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పోటుకమ్మడంతో నదికి వెళ్లేదారిలోని కల్వర్టుపై వరద ఉధృతంగా పారుతోంది. నదీతీరంలోని వందలాది ఎకరాల్లో పంట పొలాలు వరదలోనే మునిగి ఉన్నాయి. 36 గంటలు దాటినా వరద తగ్గుముఖం పట్టకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
స్వాగత తోరణం వద్దకు చేరిన వరద
మంథని వద్ద గోదావరి ఉధృతి

నీట మునిగిన సమ్మక్క – సారలమ్మ గద్దెలు

నీట మునిగిన సమ్మక్క – సారలమ్మ గద్దెలు

నీట మునిగిన సమ్మక్క – సారలమ్మ గద్దెలు