
బీఆర్‌ఎస్ భవిష్యత్ కోసమే కవిత సస్పెన్షన్
గోదావరిఖని: బీఆర్‌ఎస్ భవిష్యత్ కోసం ఎమ్మె ల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తమ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన మంగళవారం పేర్కొన్నారు. కొద్దిరోజులుగా కవిత చేసే ప్రకటనలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నా రు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించబో మని తేల్చి చెప్పారని, బీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్ ముఖ్యమని భావించి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు.
కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నాం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి అన్నారు. గోదావ రిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసి న సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఎమ్మెల్సీ కవిత క్రమశిక్షణా రాహిత్యంతో పార్టీకి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అంటే నాలుగు కోట్ల ప్రజల ఇంటి పార్టీ అని, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యమన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించబోమని కేసీఆర్ అనాడే చెప్పారని, కూతురు కన్నా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు శాంతలక్ష్మి, అరె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కూతురు కన్నా కార్యకర్తలే ముఖ్యమని..
మంథని: ఎమ్మెల్సీ కవిత విషయంలో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. కన్నకూతురు కన్నా కష్టంలోఉన్న పార్టీకి అండగా ఉండే కార్యకర్తల భవిష్యత్ ముఖ్యమని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.