సొంతిల్లా.. కంపెనీ క్వార్టరా? | - | Sakshi
Sakshi News home page

సొంతిల్లా.. కంపెనీ క్వార్టరా?

Sep 3 2025 4:47 AM | Updated on Sep 3 2025 4:47 AM

సొంతిల్లా.. కంపెనీ క్వార్టరా?

సొంతిల్లా.. కంపెనీ క్వార్టరా?

● కార్మికుల అభిప్రాయాల సేకరణకు సీఐటీయూ బ్యాలెట్‌ పోరు

గోదావరిఖని: సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలా, లేక కంపెనీ క్వార్టర్‌ కేటాయించాలా? అనే అంశంపై కార్మికుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఐటీయూ బ్యాలెట్‌ పోరా టానికి సిద్ధమైంది. కొత్తగా డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు యాజమాన్యం యోచిస్తుండగా.. సీఐటీయూ కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించి ఇ వ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఈవిషయంపై ఏడా ది నుంచి సింగరేణి అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ వస్తోంది. ఇందుకోసం అవసర మైన గ ణాంకాలను వారి ముందు ఉంచుతోంది.

ప్రభుత్వానికి, సింగరేణికి ఆదా..

సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా కార్మికులకు పూర్తిస్థాయి ప్రయోజనం కలుగుతుందని, సింగరేణి, ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని సీఐ టీయూ చెబుతూ వస్తోంది. అయినా, అటు సర్కార్‌గానీ, ఇటు సింగరేణి గానీ స్పందించడంలేదు. ఈ విషయంపై కార్మికుల అభిప్రాయం తె లుసుకోవాలని నిర్ణయించిన యూనియన్‌.. ఈనె ల 11, 12వ తేదీల్లో అన్ని ఏరియాల్లోని బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్లపై బ్యాలెట్‌ ఓటింగ్‌ చేపట్టేందుకు నిర్ణయించింది.

సొంతింటి కల సాకారం చేయాలి..

సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని, సొంతింటి కల నెరవేర్చాలని, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను యాజమాన్యమే చెల్లించాలని, మారుపేర్లు మార్పు చేయాలని, పనిస్థలాలు, కార్మికకాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.42వేల కోట్లు వెంటనే చెల్లించాలని, ప్రతీనెల మెడికల్‌బోర్డు నిర్వహించి గ తంలో మాదిరిగానే మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చే యాలని, క్లరికల్‌ పోస్టులకు వెంటనే టెస్ట్‌ నిర్వహించాలని, జేఎంఈటీ ఖాళీలతో సంబంధం లే కుండా ఓవర్‌మెన్‌కు పదోన్నతి కల్పించాలని, రిక్వెస్ట్‌ సర్వీస్‌లో మూడేళ్ల నిబంధన తొలగించా లని కోరుతోంది. సేఫ్టీ త్రైపార్టెడ్‌ సమావేశాలకు అన్నియూనియన్‌లను ఆహ్వానించాలని, సేఫ్టీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలని, బాటా షూ కొనుగోలు చేసి అందించాలని, వీటితో పాటు పలు సమస్యలపై పోరాటాలకు సీఐటీయూ సర్వసన్నద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement