
వైఎస్సార్ చిరస్మరణీయులు
పెద్దపల్లిరూరల్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించారని, పేదపిల్లలకు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బుషణవేన సురేశ్ గౌడ్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అ నంతరం మాట్లాడారు. పేదలకు ఉచితంగా కా ర్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథ కం అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్ అని గుర్తుచేశారు. నాయకులు బూతగడ్డ సంపత్, దొ డ్డుపల్లి జగదీశ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నెత్తెట్ల కు మార్, నదీం, నల్లగొండ కుమార్, ఫణీంద్రభూపతి, కళ్యాణ్, రాకేశ్, అడప సంతోష్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక నెహ్రూ విగ్ర హం వద్ద జరిగిన వైఎస్సార్ వర్ధంతి సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అ న్నయ్యగౌడ్, నాయకులు దామోదర్‌రావు, మినుపాల ప్రకాశ్‌రావు, చిలుక సతీశ్, అబ్బయ్యగౌడ్, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, అమీనొద్దీన్, రఫీక్, సత్యనారాయణ, పో చం, చంద్రయ్య గౌడ్, దేవేందర్, ఫహీం, రాజ య్య, శ్యామ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.