నిమజ్జనంపై నిఘా | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనంపై నిఘా

Sep 5 2025 5:02 AM | Updated on Sep 5 2025 5:02 AM

నిమజ్

నిమజ్జనంపై నిఘా

పోలీసు సూచనలు పాటించాల్సిందే..

డ్రోన్‌, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ఏర్పాట్లు ఇలా..

సేఫ్టీ, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి..

జిల్లాలో..

నిమజ్జనానికి వెళ్లే

గణపతి విగ్రహాలు: 2,524

బందోబస్తు..

ఏసీపీలు : ముగ్గురు

సీఐ/ఆర్‌ఐలు : 8 మంది

ఎస్సై/ఆర్‌ఎస్సై : 24 మంది

హెడ్‌/కానిస్టేబుళ్లు : 180 మంది

స్పెషల్‌పార్టీ : 30 మంది

హోంగార్డులు : 32 మంది

ట్రాఫిక్‌,ఎన్‌సీసీ,ఎన్‌ఎస్‌ఎస్‌ : 40 మంది

సింగరేణి సెక్యూరిటీ : 100 మంది

గోదావరిఖని(రామగుండం): జిల్లాలోని పలు కూడళ్లలో ప్రతిష్టించిన గణనాథుల నిమజ్జనోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నిమజ్జనానికి వెళ్లే గణనాథులకు విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి పూజలు చేసిన అనంతరం వీడ్కోలు పలికేందుకు, పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో నిమజ్జన ప్రాంతాల వద్ద అంతా సిద్ధం చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత మేర చీకటిపడేలోగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని పోలీసుశాఖ సూచిస్తోంది.

● నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనం కండీషన్‌, డాక్యుమెంట్లు చెక్‌ చేసుకోవాలి.

● వాహనాన్ని నడిపే డ్రైవర్‌ పూర్తి వివరాలు కమిటీకి తెలిసి ఉండాలి.

● డ్రైవర్‌ మద్యం సేవించరాదు. మద్యం సేవించి భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనరాదు.

● నిమజ్జనంలో దేవుడి పాటలు మాత్రమే ఉపయోగించాలి. డీజే సౌండ్స్‌ వినియోగించొద్దు.

● డీజే వాడితే సీజ్‌చేసి చట్టప్రకారం చర్యలుంటాయి. చీకటి పడేలోగా నిమజ్జనం పూర్తి చేయాలి.

● నిమజ్జనం ప్రదేశంలో ఫొటోలు, సెల్ఫీల కోసం గుమికూడరాదు.

నిమజ్జన ప్రాంతాల పరిశీలన

జిల్లాలో నిమజ్జనం జరిగే గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ప్రాంతాలను గురువారం రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా పరిశీలించారు. ప్రధానంగా గోదావరిఖని గోదావరి బ్రిడ్జివద్ద విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా జరుగనుంది. సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీపీసీ, మున్సిపల్‌ సమన్వయంతో రోడ్ల మరమ్మతు, ప్లడ్‌ లైట్లు, క్రేన్లు, గోదావరిబ్రిడ్జిపై ఫ్లాట్‌ఫాంలు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్‌ కెమెరాల పర్యవేక్షణలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనుంది. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా శోభాయాత్రలో వాహనాల మూమెంట్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించనున్నారు.

గోదావరిబ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు

విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో గోదావరిఖని సమీపంలోని గోదావరినదిపై మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. మంచిర్యాల వైపు వెళ్లే, గోదావరిఖని వైపు వచ్చే వాహనాలను ఒకేవైపు నుంచి పంపించనున్నారు. గోదావరిఖని మిలీనియం క్వార్టర్ల సమీపం నుంచి వాహనాల మళ్లింపు కొనసాగనుంది.

జిల్లాలో ప్రధాన నిమజ్జన ప్రాంతాలు

గోదావరిఖని సమీపంలోని గోదావరి బ్రిడ్జి

మంథని పట్టణంలో గోదావరినది తీరం

పెద్దపల్లిలో ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌

సుల్తానాబాద్‌లో చెరువు

గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లే ప్రధాన రోడ్ల వెంట తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు.

నిమజ్జన ప్రాంతాల్లో ప్లడ్‌ లైట్లు, క్రేన్లు, తాగునీటి వసతి కల్పించారు.

గోదావరినదిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

నిమజ్జన శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

డ్రోన్‌కెమెరా ద్వారా శోభాయాత్ర పర్యవేక్షణ

కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించాం. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనోత్సవంలో పాల్గొనేలా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రధానంగా గోదావరినదిపై నిమజ్జన కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తాం.

– అంబర్‌కిషోర్‌ఝా, సీపీ, రామగుండం

నిమజ్జనంపై నిఘా1
1/1

నిమజ్జనంపై నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement