
జేఎన్టీయూ.. అరకొర వసతులు
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుతోనే సరిపెట్టారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం పక్కా భవనం నిర్మాణం మరిచిపోయింది. దీంతో తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో ఉన్న వసతులు ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోయేలా లేవు. అయినా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021–02 విద్యాసంవత్సరంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి అగ్రహారం డిగ్రీ కాలేజీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.
చాలీచాలని తరగతి గదులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తరగతి గదుల్లోని సగం గదులను తాత్కాలికంగా జేన్‌టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు. నాలుగేళ్లుగా అరకొర గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అగ్రహారం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు కోర్సుల్లో 1,032 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ దాదాపుగా 20 తరగతి గదులు అవసరం ఉంటుంది. కానీ అరకొర గదులతోనే నెట్టుకొస్తున్నారు.
కొండగట్టులో ప్రాక్టికల్స్
కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ మాత్రమే ఉంది. ఈసీఈ, మెకానికల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలకు తీసుకెళ్తున్నారు. సివిల్ కోర్సు విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని ల్యాబ్‌కు తీసుకెళ్తున్నారు. మిగతా కోర్సులకు అంతంతే ల్యాబ్ సౌకర్యం ఉంది.
అద్దె భవనాల్లో హాస్టల్ వసతి
అగ్రహారంలోని ఎనిమిది అద్దె భవనాల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం కళాశాలలోని మెస్‌లో టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటుంది. రాత్రి కొందరు మెస్‌లో తింటున్నారు. దూరంగా ఉన్న హాస్టల్ విద్యార్థులకు అక్కడికి భోజనం పంపుతున్నారు. హాస్టల్ నుంచి కాలేజీకి దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. హాస్టల్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ రావాల్సిందే.
ఇద్దరే ప్రభుత్వ ప్రొఫెసర్లు
కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా ఇద్దరే రెగ్యులర్ ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకరు ప్రిన్సిపాల్, మకొకరు ఈసీఈ ప్రొఫెసర్. కాంట్రాక్ట్ పద్ధతిన ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు.
అగ్రహారం డిగ్రీ కాలేజీలో తరగతులు
సరిపోని తరగతి గదులు
కిలోమీటర్ దూరంలో హాస్టల్
అద్దె భవనం.. అసౌకర్యాలు
ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
కళాశాలలో కోర్సులు, విద్యార్థులు
కోర్సు ఫస్టియర్ సెకండియర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్
సివిల్ 14 61 60 59
ఈఈఈ 16 62 60 63
మెకానికల్ 0 01 59 56
ఈసీఈ 54 68 66 64 సీఎస్‌ఈ 67 65 69 68
మొత్తం 151 257 314 310